29-09-2025 12:36:10 AM
దేశ రక్షణకోసం వామపక్ష, ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకంకావాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
ఘనంగా భగత్సింగ్ 118వ జయంతి
భద్రాద్రికొత్తగూడెం, సెప్టెంబర్ 28, (విజయక్రాంతి):దేశ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి స్వాతంత్రోద్యమంవైపు నడిపించిన భగత్ సింగ్ నేటి తరానికి స్ఫూర్తి అని, అయన శాస్త్రీయ ఆలోచనల ఆచరిస్తూ యు వత మేల్కొనాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నా రు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో ఆదివారం భగత్ సింగ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
తొలుత భగత్ సిం గ్ చిత్ర పాఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశం లో సాబీర్ పాషా మాట్లాడుతూ లెనిన్ ఆలోచనలను పుణికిపుచ్చుకుని జాతీయోద్యామా లను నడిపించాడని, భగత్ సింగ్ తన రచనలలో ’నేను నాస్తికుడిని ఎందుకు?’ వంటి వ్యాసాల ద్వారా కేవలం దేశభక్తి మాత్రమే కాదు, శాస్త్రీయ దృక్కోణం, సామాజిక న్యా యం, సమానత్వం పట్ల తన కట్టుబాటు స్పష్టంగా తెలియ జేస్తాయన్నారు.
తాను ఉరికంబం ఎక్కేముందు సైతం లెనిన్ రచనల చదివేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన నిక్సాన దేశభక్తుడని అన్నారు. స్వతంత్ర పో రాటంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కేంద్రం దేశభక్తులుగా చిత్రీకరిస్తూ దేశంకోసం ప్రాణాలర్పించిన వారిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
మోడీ పాలన నాటి బ్రిటీష్ తెల్లదొరల, రజాకార్ల పాలనను తలపిస్తోందని, చట్టసభల్లో ఉన్న మందబలంతో కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ నిరంకుషపాలనను కొనసాగిస్తున్నారని, మరోవైపు ప్రజలు నిర్మించుకున్న 400కు పైగా ప్రభుత్వ సంస్థలను ఆదానీ, అంబానీ లాంటి కుభేరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
మోడీ తీరుతో దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం ఏర్పడిందని, ప్రమాదకర పాసిస్టు నిరంకుశ, హిట్లర్ తరహా పాలనను కొనసాగిస్తున్న పరిస్థితిలో నాటి అమరవీరులు భగంధ్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని దేశ ప్రజలు స్వదేశీ పాలకులపై తిరిగబడాలని, అదే ఆయనకిచ్చే నిజమైన, ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస, కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.