29-09-2025 12:37:54 AM
* ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్ పూర్, సెప్టెంబర్ 28 :ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్ కాలనీలో ఆదివారం ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపాలిటీతో పాటు నూతనంగా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల పరిధిలోని కాలనీలకు సైతం స్వచ్ఛ జలాలు అందిస్తున్నామని తెలిపారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేందుకు నూతన రిజర్వాయర్లు నిర్మించినట్లు తెలిపారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సిఐ నరేష్, మాజీ సర్పంచ్ కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, రాజు, శ్రీకాంత్, కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.