29-09-2025 12:35:50 AM
అభినందించిన కాట సుధా శ్రీనివాస్ గౌడ్
అమీన్ పూర్, సెప్టెంబర్ 28 :గ్రూప్-1 పరీక్షల్లో 141వ ర్యాంక్ సాధించి సివిల్ లో డీఎస్పీగా నియామక పత్రం అందుకున్న వెంకట్ దీప్ను బీరంగూడలోని అతని నివాసంలో సంగారెడ్డి జిల్లా మ హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్పూ ర్ 15వ వార్డ్ కౌన్సిలర్ కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ స్వయంగా వెళ్లి సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ మన ప్రాంతం నుంచి ప్రతిభావంతులైన యువకులు గ్రూప్-1 వంటి అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయం సాధించడం గర్వకారణమన్నారు. వెంకట్ దీప్ విజయంతో యువతలో మరింత స్ఫూర్తి, ఉత్తేజం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని వెంకట్ దీప్కు శుభాకాంక్షలు తెలియజేశారు.