23-05-2025 01:03:24 AM
మున్సిపల్ ఆఫీసులో ఘనంగా జయంతి వేడుకలు
అబ్దుల్లాపూర్‌మెట్, మే 22: మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీందర్‌రెడ్డి అన్నారు. పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కార్యాలయం లో గురువారం భాగ్యరెడ్డి వర్మ 137వ జ యంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కమిషనర్ పూలమా ల వేసి నివాళిలర్పించారు.
ఈ సందర్బంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు. భాగ్యరెడ్డి వర్మ, దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కిరణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.