23-09-2025 01:30:58 AM
-సాగునీరు, పౌరసరఫరాల రంగాల్లో కఠిన ప్రమాణాలు
-అప్పుడే ప్రగతికి, ప్రజా సంక్షేమానికి పునాది
-క్యూసీఎఫ్‌ఐ 39వ వార్షిక సదస్సులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు సామర్థ్యం, నాణ్యతే మూలస్తంభమని, సాగునీరు, పౌరసరఫరాల వంటి కీలక రం గాల్లో కఠినమైన ప్రమాణాలు పాటిస్తేనే ప్ర జా సంక్షేమ ఫలాలు ఎలాంటి వృథా, పక్కదారి పట్టకుండా ప్రజలకు చేరతాయని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా(క్యూసీఎఫ్‌ఐ) చాప్టర్ నిర్వ హించిన 39వ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రతి దశలోనూ సామర్థ్యం, నాణ్యతకు హామీ ఇచ్చేలా ప్రభుత్వం డిజిటలైజేషన్, రియల్-టైమ్ మానిటరింగ్, ఆటో మేషన్‌పై పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, పైప్‌లైన్లు, రిజర్వాయర్ల నిర్మాణ నాణ్యత రైతుల జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. నాసిరకమైన డిజైన్ లేదా నిర్మాణం దశాబ్దాల పాటు నీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తుందని హెచ్చరించారు. పౌరసరఫరాల విషయంలో ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ప్రతి గింజ పేదలకు చేరేలా చూడాలంటే సేకరణ, నిల్వ, రవాణా, పంపిణీలో నాణ్యత అత్యంత ఆవశ్యకమని అన్నారు.
నాణ్యత.. జాతీయ అవసరం
నాణ్యత కేవలం వ్యాపార అవసరమే కాదని, అదొక జాతీయ అవసరమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. నాసిరకమైన ఉత్పత్తులు, సేవలు వినియోగదారుల అసంతృప్తికి కారణమవడమే కాకుండా, ప్రపంచ మార్కెట్‌లో ‘బ్రాండ్ ఇండియా’ ప్రతిష్టను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. “భారత్ ప్రపంచ స్థాయి నాణ్యతను అందించినప్పుడు, దేశానికి విశ్వసనీయత, మార్కెట్ల లో ప్రవేశం, గర్వకారణం లభిస్తాయి. ప్రభు త్వ పాలనలో నాణ్యత అంటే, ఎలాంటి అవకతవకలు లేకుండా సరైన సేవను సరైన సమయంలో అందించడమే,” అని ఆయన అన్నారు.
2047 నాటికి స్వావలంబన భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నాణ్యత, ఉత్పాదకత, సుస్థిరతలే పునాదులుగా ఉండాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. నిజమైన స్వావలంబన సాధించాలంటే మూడు స్తంభాలను బలోపేతం చేయాలని సూచించారు. అవి దేశీయ పరిష్కారాల కోసం ఆవిష్కరణలు, -పరిశోధన, 2) భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తి కోసం నైపుణ్యాభివృద్ధి, 3) భారతీయ ఉత్పత్తులు, సేవలను ప్రపంచవ్యా ప్తంగా పోటీపడేలా చేయడానికి నాణ్యతలో శ్రేష్ఠత అని అన్నారు.
వారధిగా క్యూసీఎఫ్‌ఐ
క్యూసీఎఫ్‌ఐ వంటి వేదికలు సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య వారధిగా పనిచేస్తా యని మంత్రి ఉత్తమ్ ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు నాణ్యతను తమ బాధ్యతగా స్వీకరించే మార్పునకు ఇది దోహద పడుతుందన్నారు. ఈ సదస్సులో పాల్గొనేవారు నాణ్యతను జీవిత విధానంగా మార్చు కోవాలని, ఆవిష్కరణలకు ఉద్యోగులను ప్రో త్సహించాలని, రోజువారీ పనిని దేశ నిర్మా ణ లక్ష్యంతో అనుసంధానించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, క్యూసీఎఫ్‌ఐకి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.