calender_icon.png 9 January, 2026 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాసనసభలో భట్టి విక్రమార్క కీలక ప్రకటన

06-01-2026 12:18:36 PM

హైదరాబాద్: శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన(Bhatti Vikramarka) చేశారు. సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. సింగరేణిపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సమాధానం ఇచ్చారు. 32 మంది వైద్యుల కోసం నోటిఫికేషన్ ఇచ్చాం.. త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.

176 మంది పారా మెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ జరగుతోందని చెప్పారు. రామగుండంలో క్యాత్ ల్యాబ్ నిర్మాణం(Ramagundam Cath Lab) పీపీపీ మోడల్ లో చేపడుతున్నాయని వివరించారు. కాంట్రాక్ట్ అవార్డు(Contract Award) పూర్తయింది.. విశ్రాంత ఉద్యోగులకు సింగరేణి ఆసుపత్రుల్లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. సీపీఆర్ఎంఎస్ పథకం(CPRMS scheme) అందుబాటులో ఉందని భట్టి విక్రమార్క వెల్లడించారు. విశ్రాంత ఉద్యోగులు రూ. 8 లక్షల వరకు మందులు తీసుకునే అవకాశముందన్నారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల(Singareni retired employees) ఇళ్ల స్థలాల కేటాయింపులపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.