calender_icon.png 7 January, 2026 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

06-01-2026 11:27:22 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly sessions) ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ... జాబ్ క్యాలెండర్ విషయంలో సామాజిక అంశం పరిశీలిస్తున్నామని తెలిపారు. హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఉబెర్ సంస్థతో ఒప్పదం చేసుకున్నాం.. త్వరలోనే ఏర్పాటవుతోందని మంత్రి వివరించారు. కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తోందన్నారు. కాగ్నిజెంట్ సంస్థ ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

పోచారం ఇన్ఫోసిస్ సంస్థ(Pocharam Infosys company) విస్తరణ ద్వారా 17వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విప్రో సంస్థ విస్తరణ ద్వారా ఐదు వేల మందికి ఉపాధి కలుగుతోందన్నారు. 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 70 జీసీసీలు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లో ముందుకెళ్తున్నామని సూచించారు. ఇప్పటికే జీనోమ్ వ్యాలీ నాలుగో దశ కూడా పూర్తయిందన్నారు. ఐటీ కంటె ఎక్కువగా ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.