calender_icon.png 29 September, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తుల దర్శన సౌకర్యార్థం భీమేశ్వరాలయం

29-09-2025 12:00:00 AM

అభివృద్ధి పనుల పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ సమయం లో భక్తులకు స్వామి వారి దర్శన సౌభాగ్యం భీమేశ్వరాలయంలో అందించాలనే ఉద్దేశం తో జరుగుచున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా శ్రీ భీమేశ్వర ఆలయం, వీఐపీ రోడ్, పార్కింగ్ స్థలాలు ఇతర ప్రాంతాలను సమీక్షించి, అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.ఆది శ్రీనివాస్. భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలు, షెడ్లు, శంకరమఠంలో నిర్మిస్తున్న అభిషేకం  కళ్యాణ మండపాలు, క్యూలైన్లు, కౌంటర్లు ఇతర సౌకర్యాల గురించి అధికారులతో కూలంకషంగా చర్చించారు.

అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, వేద పాఠశాల ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేస్తున్న వసతులపై సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో  ఎల్. రమాదేవి, కార్యనిర్వాహక ఇంజనీర్ రాజేష్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు రఘునందన్, మహిపాల్ రెడ్డి, ఏఈఓ శ్రావణ్ కుమార్.

తదితర ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. ఆలయంలో చేపట్టిన పనులు మరింత వేగవంతం కానున్నాయని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.