29-09-2025 12:00:00 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణ ప్రజలు శనివారం రాత్రి సద్దుల బతుకమ్మ పండగ సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ లను పెట్టి ఆటపాటలతో అలరించారు. సద్దుల బతు కమ్మ సందర్భంగా గురుకుల్ కళాశాల మైదానం వద్ద జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ ఆధ్వ ర్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.
విద్యుత్ లైటింగ్, డీజీఏ సౌండ్ సిస్టంలతో పాటు బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లను చేశారు. మహిళలు, యువతులు బతుకమ్మలతో పెద్దసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆట పాటలతో హోరెత్తించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, సీఐ బాలస్వామి, డిఐ శ్రీనివాస్ హాజరయ్యారు. అతిథులను మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. గ్రామపెద్దలు పాల్గొని ఈబతుకమ్మ సంబరాలను తిలకించారు.
అలాగే పట్టణం లోని పలుచోట్ల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, మాజీ కౌన్సిలర్ లు బర్ల శశికళ, కొమ్మగోని రమాదేవి, బేతాళ నర్సింగరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, నాయకులు కొంతం అంజిరెడ్డి, బర్ల దేవేందర్ , బొక్క సత్తిరెడ్డి, కేశవపట్నం ఆంజనేయులు, శశిధర్, రాజబోయిన రామ చందర్ యాదవ్, జన చైతన్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సార శ్రీనివాస్ గౌడ్, అబ్బసాని పొన్నయ్య యాదవ్, గాజుల వీరేందర్ యాదవ్, శివరాత్రి సురేష్, మామిళ్ళ రమేష్, మానుక కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ కార్యాలయం వద్ద..
ఘట్ కేసర్ గ్రంథాలయ కార్యాలయం వద్ద జరిగిన బతుకమ్మ ఈవేడుకలలో మాజీ ఎంపీపీ బండారి దాసుగౌడ్, బిఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా వారి కుటుంబ సభ్యులు, మాజీ వైస్ చైర్మెన్ పలుగుల మాదవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బండారి వసంత, బండారి అంజనేయులుగౌడ్ లతో పాటుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.