27-01-2026 02:01:36 AM
హైదరాబాద్, జనవరి 26: మార్కెట్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ అన్నారు. పాత మరుగుదొడ్లు పూర్తిగా ధ్వం సం అవడంతో రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని సోమవారం చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ వై స్ చైర్మన్, డైరెక్టర్‌లతో కలిసి మార్కెట్‌లో రూ.10 లక్షలతో నిర్మించనున్న నూతన మ రుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌లో ఉన్న సమస్యలను పరిష్కరి స్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి వెంకటేష్ ముదిరాజ్, డైరెక్టర్లు శంకర్, పండు వెంకటరెడ్డి పాల్గొన్నారు.