calender_icon.png 27 January, 2026 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

27-01-2026 01:59:57 AM

హెలెన్ కిల్లర్ ఇన్‌స్టిట్యూషన్‌లో నిర్వహణ

హైదరాబాద్, జనవరి 26: నేరేడ్‌మెట్ హెలెన్ కిల్లర్ ఇనిస్టిట్యూషన్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ లైన్ పటాన్ ఉమర్ఖాన్, ఫౌండర్ అండ్ చైర్మన్ కిల్లర్ ఇనిస్టిట్యూషన్ డాక్టర్ ఆర్ముగం, డైరెక్టర్ డాక్టర్ శశిధర్ రెడి,ప్రిన్సిపాల్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంజయ్య, లెనిన్ బాబు, శ్రీవిద్య తదితర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథి పటాన్ ఉమర్ఖాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో పాటుపడుతూ సమాజం పట్ల బాధ్యతతో హక్కులను గౌరవిస్తూ సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని సమాజాన్ని తద్వారా దేశ అభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని చెప్పారు.

ఇందులో భాగంగా హెలెన్ కిల్లర్ లో బీకాం చదువుతున్న భద్ర విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 45 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు ఈ కంప్యూటర్ రంగంలో శిక్షణ కార్యక్రమాన్ని అందజేశారు. ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల జూనియర్ కళాశాల బీకాం విద్యార్థులకు వివిధ రకాల క్రీడలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.