calender_icon.png 13 December, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పరిస్థితి..?

13-12-2025 12:00:00 AM

  1. అధికారంలో ఉన్నా..దూరం దూరంగా ఓటర్లు
  2. మొదటి విడతలో జడ్చర్లలో రెండు మండల పరిధిలో  ఎన్నికలు
  3. మెజార్టీ గ్రామాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ 
  4. ఐక్యంగా ముందుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పిలుపు
  5. ఎన్నికల కంటే ముందే  చెప్పాల్సింది.. అంటున్న జనం
  6. ఎవరు గెలిచిన నా వల్లే గెలిచినట్టు అంటూ ఎమ్మెల్యే ప్రకటన
  7. జడ్చర్ల నియోజకవర్గంలో అధికారం వైపు చూడని పంచాయతీ ఓటర్లు 

జడ్చర్ల డిసెంబర్ 1౨ : జడ్చర్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అధికారంలో ఉండి మరో మూడేళ్ల కాలం ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు గెలవడం వెనుక ఉన్న అంతర్వేమేమిటో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి.

మొదటినుంచి జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి జనానికి అందుబాటులో ఉండడం లేదనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదంటూ జనం చెబుతున్న మాట. ఈమాటకు ముగింపు పలికెందుకు గడిచిన రెండేళ్ల సమయం కూడా ఎమ్మెల్యేకు సరిపోకపోవడంతో జనం ప్రతిపక్ష పార్టీ నేతల వైపు చూస్తున్నారని ఇప్పుడు వచ్చిన ఫలితాలను చూస్తే ఇదే నిజమనక తప్పదు.

కేవలం కార్యక్రమాలకే పరిమితమైన ఎమ్మెల్యే జనానికి అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో విఫలమైతున్నట్లు సొంత కార్యకర్తలు నేతలు చెబుతున్న మాట. ఇందులో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ మొదటి విడుదల అత్యధిక పంచాయతీలను తమ మద్దతుదారులను గెలిపించుకున్నట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్యేనే వివరణ ఇచ్చే పరిస్థితి...

పంచాయతీ ఎన్నికలు ప్రారంభించిన సమయంలో అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి అధికార పార్టీ నేతలను బరిలో నిలిపి ఐక్యంగా ఉండి గెలవాల్సిందే అని సూచించాల్సిన ఎమ్మెల్యే మొదటి విడత ఫలితాలను చూసి ఇప్పుడు ఐక్యంగా ఉండాలంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కలిసి ఒక్కరినే బలపరిచి గెలుపు దిశగా ముందుకు తీసుకుపోవాలని సూచనలు చేయడం జడ్చర్ల నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పార్టీ కార్యకర్తలు తెలిపిన సమాచారం మేరకు రాజాపూర్ మండల పరిధిలో 24 గ్రామాలలో  కేవలం 4 గ్రామాల్లో మాత్రమే అధికార పార్టీ మదిద్దరు గెలవడం, సొంత గ్రామంలో రంగరెడ్డిగూడెంలో బిజెపి మద్దతుదారుడు గెలవడం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి చేదు అనుభవమే మిగిలిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నవపేట్ మండలంలోని నాలుగు గ్రామాలు ఏకగ్రీవమైనప్పటికీ 19 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్,17 గ్రామపంచాయతీలలో బీఆర్‌ఎస్ మద్దతు ధరలు గెలుపులను తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది. రెండు మూడో విడతల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో విజయ్ చేరాలని ఎమ్మెల్యే సూచించడం కార్యకర్తలు ఏ మేరకు ఐక్యంగా ఉండి ముందుకు సాగుతారు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఐక్యత చేయడంలో విఫలం...

కాంగ్రెస్ కార్యకర్తలను ఒక్కదాటికి పైకి తీసుకువచ్చి ఐక్యంగా బరిలో నిలిపేదంలో జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఎవరికి వారే యమునా తీరై అనే విధంగా ఉండటం వల్ల పార్టీకి తీవ్ర నష్టం కావడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు పంచాయతీ ఎన్నికల్లో విజయ డంక మోగించేందుకు అవకాశాలు మెండుగా ఉంటున్నాయని పలువురు పేర్కొనడం విశేషం. ఐక్యత మారుమోగుతుందా మొదటి విడత ఫలితాలే యధావిధిగా వస్తాయా అనే సందేహానికి ఈ నెల 14, 17 తేదీలలో జరగనున్న ఎన్నికల్లో ఫలితాలు వేచి చూడవలసిందే.