05-11-2025 12:25:08 AM
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:4 మండల సర్వే ల్యాండ్ శాఖ కార్యకలాపాలపై మంగళవారం కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలె క్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో సర్వే అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎఫ్-లైన్ పిటిషన్లు,అప్పీలు, డి-మార్కేషన్లు,ప్రజావాణి అప్లి కేషన్లు పెండింగ్లో ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
ప్రతి నెలా మండల సర్వే యర్లు టూర్ డైరీలు సమర్పించాలని, టిజిఐఐసి సర్వేలకు సంబంధించిన ఫైళ్లను తక్షణ మే డిస్పోజల్ చేయాలని,భూ భారతి రెవె న్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఫీల్ వెరిఫై చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.సర్వే శాఖలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.సర్వే శాఖలో ఉన్న అన్ని పెండింగ్ దరఖాస్తులను డిసెంబర్లోపు పరిష్కరించాలి అని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..