05-11-2025 12:26:51 AM
కొండపాక, నవంబర్ 04:కొండపాక మండలం మర్పడగ గ్రామం లోని శ్రీ విజయ దుర్గా సామెత సం తన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మంగళవారం వైకుంఠ చతుర్దశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉద యం 6 గంటల నుంచి విజయదుర్గా మాతకు విశేష పంచామృత పలరస అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు అనంతరం సుబ్రహ్మణ్యస్వామికి విశేష పంచామృత పలరస అభిషేకం నిర్వహించారు.
మహిళలు ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తిక దీపాలు వెలిగించి దీపదానం చేసుకున్నారు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటల నుంచి కార్తీక దీపోత్సవం జరుగుతుందని అనంతరం జ్వాలాతోరణం ఉంటుందని క్షేత్ర నిర్వాహకులు చెప్పాల హరినాధ శర్మ తెలిపారు. జ్వాలా తోరణం ద్వారా ఉత్సవమూర్తుల పల్లకి సేవ అనంతరం భక్తులు జ్వాలాతోరణం దాటాలని తద్వారా నరక బాధలు ఉండవని ఆయన తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దైవకృప పొందాలని సూచించారు.