calender_icon.png 9 May, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిష్కారం కోసమే భూభారతి

09-05-2025 12:00:41 AM

-గత ప్రభుత్వము సొమ్ము చేసుకునేందుకే ధరణి తెచ్చింది 

-రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ప్రజలే తిరగబడతారు 

-దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

ముసాపేట మే 8 : భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి తీసుకురావడం జరిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మూసాపేట్ మండలలోని కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్,  రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

నలుగురు వ్యక్తులు కలిసి భూములను లాక్కున్నందుకే ధరణి తీసుకువచ్చి సొమ్ము చేసుకున్నారని గత ప్రభుత్వ నేతలను విమర్శించారు. ధరణి ద్వారా వచ్చిన డబ్బులోతో బీఆర్‌ఎస్ నేతలకు అహం పెరిగిందని అసలం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని చక్కబెడుతున్న ముఖ్యమంత్రి మీ విమర్శించబడిగా టిఆర్‌ఎస్ నేతలు పెట్టుకున్నారని తెలిపారు. దీనివల్ల వారికే నష్టం జరుగుతుందని సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని విమర్శించారు.

గత ప్రభుత్వం చేసిన రూ 8 లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం బయట పెట్టడం తప్పు ఎలా అవుతుందని బిఆర్‌ఎస్ నాయకులను నిలదీశారు. రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం వంటి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు.

అనంతరం అడ్డాకుల, మూసాపేట్ మండలాల కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మూసాపేట్ మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో అడ్డాకుల, మూసాపేట్ మండలాల రైతులకు స్పింక్లర్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, రైతులకు స్పింక్లర్స్ లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.