22-01-2026 01:57:41 AM
కేసముద్రం, జనవరి 21 (విజయక్రాంతి): దూర ప్రాంతాల నుంచి కాలినడకన పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కష్టాలను తీర్చడానికి మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీ మూ డు లక్షల రూపాయల విలువైన 32 సైకిళ్లను, 20 డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేసి అండగా నిలిచింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు బుధవా రం జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధు లు మూల వినయేందర్ రెడ్డి, గౌండ్ల మల్ల య్య, హెచ్‌ఆర్ రామకృష్ణ, సర్పంచ్ ఎదురబోయిన సురయ్య చేతుల మీదుగా అందజే శారు. ఈ కార్యక్రమంలో జయపాల్ రెడ్డి మహేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.