calender_icon.png 26 January, 2026 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 08:01:37 PM

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణే తమ ప్రధాన కర్తవ్యం

హుజూర్ నగర్ సీఐ చరమందరాజు

హుజూర్ నగర్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల ఆస్తి,ప్రాణ రక్షణే తమ ప్రధాన కర్తవ్యమని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు అన్నారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐ చరమందరాజు జాతీయ పతాకాన్ని ఎగరవేసి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఐ చరమందరాజు మాట్లాడుతూ... భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, స్వేచ్ఛలు ప్రతి పౌరుని బాధ్యతలతోనే పరిపూర్ణతను సాధిస్తాయన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో పోలీస్ విభాగం కీలక భూమిక నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల ఆస్తి,ప్రాణ రక్షణే తమ ప్రధాన కర్తవ్యమని,ప్రజలు చట్టానికి లోబడి జీవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ, దేశభక్తి, త్యాగస్ఫూర్తితో విధులు నిర్వర్తించినప్పుడే గణతంత్ర విలువలకు నిజమైన అర్థం చేకూరుతుందని, యువత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని, దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మోహన్ బాబు, ఏఎస్‌ఐ బలరాంరెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాసరెడ్డి, సురేష్,కానిస్టేబుళ్లు వినోద్, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.