15-11-2025 08:02:02 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో బిర్స ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ మండల అధ్యక్షులు కొరెత తిరుపతి మాట్లాడుతూ బిర్స ముండా అతి చిన్న వయసులోని ఆంగ్లేయులపై పిడికిలి బిగించిన ఆయన ధైర్య సాహస పోరాటాలు స్కరించుకుంటూ భారత్ ప్రభుత్వం జన్ జాతియ గౌరవ్ దివస్ ప్రకటించింది.
ఉద్యమానికి ప్రాణం పోసిన మహోన్నత వీరుడు గిరిజనుల స్వాతంత్రం యుద్ధ దిక్సూచి ప్రేమతో ప్రజల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆయన చూపిన ధైర్యం నిస్వార్ధ సేవా మార్గం పోరాటం గిరిజనుల గౌరవం అణగారిన వర్గాల హక్కుల కోసం నిబద్ధత ముందుకు సాగిన పోరాటం నేటికీ మనకు ఆదర్శం ప్రతి ఒక్కరు బీర్స ముండా పోరాట ఉద్యమాలు ఆదర్శంగా తీసుకొని ఆదివాసి చట్టాలు హక్కుల సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధి కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆదివాసి సమాజానికి తెలియజేస్తున్నాము అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిడం సక్కరం, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ్య, కొలవార్ ఉపాధ్యక్షులు మనేపెళ్ళి మల్లేష్, కొలావార్ జిల్లా యువజన అధ్యక్షులు మెడి సతీష్, ప్రచార కార్యదర్శి కొరెత లాలయ్య, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్యామ్ రావు, కార్యవర్గ సభ్యులు కుర్సింగ శంకర్, పెద్దల శంకర్, పోర్సేటి సర్ధాజి, మల్లేష్,తోగయ్య, సిడం షణ్ముఖ, నాయిని స్వామి, కొలవార్ జిల్లా సహాయక కార్యదర్శి పోల్క వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన పంచాయతీ కార్యదర్శులు పేధం తుక్కరం, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.