15-11-2025 08:06:04 PM
తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి..
తూప్రాన్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ ఆర్ ఆర్ ఆర్ వాడుకలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించిన భూసేకరణ పనులు చివరి దశకి చేరుకొని రైతుల అకౌంట్స్ లో డబ్బులు జమ చేయడం జరిగిందని ఇప్పటికే 178 మంది రైతుల ఖాతాలో 13 కోట్ల రూపాయలు జమ చేశామని ఆర్.డి.ఓ జయ చంద్రారెడ్డి అన్నారు.
గ్రామాల వారిగా గుండ్రెడ్డిపల్లి గ్రామంలో 76, వెంకటయిపల్లిలో 88, దాతర్ పల్లి 2, కిష్టాపూర్ గ్రామంలో 1, వట్టూర్ గ్రామంలో 11 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. మీ ఖాతాలో డబ్బులు పడని రైతులు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని అతి త్వరలో తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు 2022 నాటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మార్కెట్ ధరల ప్రకారం 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం నిర్ణయించిన నష్ట పరిహార ధరకు డబ్బుల జమ వుతున్నాయని 1956 నాటి కేంద్ర రహదారుల చట్టం ప్రకారం భూ యజమానులకుర్పాటైన ధర నిర్ణయంపై ఆర్బిట్రేషన్ కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తులు అందించారు.