24-07-2025 01:17:40 AM
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్.. బీసీ వ్యతిరేక పార్టీలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆర్డినెన్స్‌కు రాష్ర్టంలో బీఆర్ ఎస్ మోకాలడ్డుతోందన్నారు. బిల్లుకు కేంద్రం లో బీజేపీ ససేమిరా అంటోందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటే బీజేపీకి రుచించడం లేదని ఆయన విమర్శించారు. 9వ షెడ్యూల్‌లో చేర్చడం ఎలా అసాధ్యమని బీజేపీ ప్రశ్నిస్తున్నదన్నారు. అలాం టప్పుడు అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు.
బిల్లు ఢిల్లీకి రాగానే ఎందుకు మాట మార్చుతున్నారని, కేంద్రం, బీజేపీ మాటలను బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడి నోటితో పలికస్తూ పలాయనం చిత్తగిస్తున్నట్లుగా కనిపిస్తోందని మండిపడ్డారు. బీసీ బిల్లు కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఓబీసీల సదస్సుల్లో రాహుల్ గాంధీ బీసీల గొంతుకై నిలువబోతున్నట్లు తెలిపారు. ఉన్న రిజర్వేషన్లను తగ్గించి, అసెంబ్లీ లో వాకౌట్లు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదన్నారు.