24-07-2025 01:17:05 AM
ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీలు బీసీ బిసి వ్యతిరేక డీఎన్‌ఏను కలిగి ఉన్నాయని ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. ఆ పార్టీలని తెలంగాణ సమాజం 100 అడుగుల లోతు గోతిలో పూడ్చిపెట్టబోతుందన్నారు. రాంచందర్‌రావు ఏ విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడో అర్థం కావట్లేదని పేర్కొన్నారు.
దొడ్డి దారిలో అధ్యక్షుడు అయిన రాంచందర్‌రావు బీసీలను కించపరిచే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీజేపీ బీసీ నాయకులు బండి సంజయ్, పాయల్ శంకర్, అరవింద్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ రిజర్వేషన్లపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీసీలను కించపరిచిన రాంచందర్‌రావును బీజేపీలోని బిసి నాయకులు గల్లా పట్టుకొని నిలదీయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ అని అర్థం అయిపోయిందని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని బీసీలు ఆదరించబోరని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడితే బీసీలు తెలంగాణలో తిరగనియ్యబోరని సాయికుమార్ హెచ్చరించారు.