calender_icon.png 13 September, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లడ్ కెనాల్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

13-09-2025 03:06:14 AM

వాజేడు,సెప్టెంబర్12(విజయ క్రాంతి):పాలెం వాగు ఫ్లడ్ కెనాల్ ను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.  వెంకటాపురం మండలం, పాలెం వాగు కెనాల్ ను వాజేడు మండలం లోని అరుగుంటపల్లి నుండి కొత్తచెరువు కి మలిస్తే మూడు గ్రామాల గిరిజన రైతులకు సుమారు 1000 ఎకరాల సాగుకు నీరు ఉపయోగపడుతుందన్నారు. కోటి రూపాయలు మంజూరు చేయించడానికి భద్రాచలం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లన్నట్లుగా తెలిపారు.

మూడు గిరిజన గ్రామాల రైతులకు ఈ కెనాల్ ద్వారా నీరు రైతుల పంటలకు నష్టం కలగకుండా  కాపాడవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, శ్రీరాముల రమేష్,లక్ష్మణ్,గాంధీ, చందర్రావు,వేణు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.