31-10-2025 01:37:37 AM
 
							కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి మైనార్టీలపై విషం కక్కుతున్నాయని ఎంపీ చామల విమర్శించారు. రెండు పార్టీ లు అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్దారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కు గుండు సున్నా తెచ్చుకుని మరీ గెలిపించిందన్నారు. ఈ మధ్యనే వారి మధ్య ఉన్న సంబంధం గురించి కవిత చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ ఒక మైనార్టీ, భారత జట్టుకు సారథ్యం వహించిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిందన్నారు.
బీఆర్‌ఎస్ కు లా భం జరగాలనే బీజేపీ ఇలా చేసిందని విమర్శించారు. గతంలో బీజేపీ రాజస్థాన్ లోని ఓ నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేసి.. ఆ తర్వాతనే మంత్రిపదవి ఇచ్చారన్నారు. బీజేపీనే అలాంటి నిర్ణయం తీసుకుని ఇప్పు డు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తుంటే అడ్డుకుంటుందని ఆరోపించారు.