31-10-2025 01:35:48 AM
 
							వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి
పుట్టిన రోజు వేడుకలకు వెళ్తుండగా వరదలో భార్యాభర్తలు గల్లంతు
కూలిన నాలుగు ఇళ్లు
విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 30: మొంథా తుఫాన్ పెనువిషాదం మిగిల్చింది. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందారు. గోడ కూలి మీద పడడంతో నిద్రిస్తున్న మహిళ, వరద ఉధృతితో కల్వర్టులో పడి మరొకరు మృతి చెందారు. పుట్టిన రోజు వేడుకల కోసం భార్య పుట్టింటికి వెళుతున్న భార్యాభర్తలు వరదలో పడి గల్లంతయ్యారు. నాలుగు ఇళ్లు కూలిపోయాయి. హుజురాబాద్ డివిజన్‌లో హుజురాబాద్ తో పాటు జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కేశపట్నం, సైదాపూర్ మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సైదాపూర్ మండలంలో సైదాపూర్ మండలం సోమవారం ఆదర్శ పాఠశాల జలమయమైంది. పట్టణంలోని 19 వ వార్డులో ఒక ఇల్లు, ధర్మరాజు పల్లి గ్రామంలో లక్ష్మికి సంబంధించిన ఇల్లు కూలిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని చేర్యా ల పట్టణానికి చెందిన రాచమల్ల అండాలుకు చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఐనవోలు మండలం కొండపర్తిలో ఓ ఇంటి గోడ కూలి గద్దల సూరమ్మ(58) అక్కడికక్కడే మృతి చెందింది.
కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం అనే వ్యక్తి కొత్తపల్లింలోకి వెళ్లే కల్వర్టు దాటుతుండగా, అందులో పడి మృతి చెందాడు. హనుమకొండజిల్లా భీమదేవరపల్లికి చెందిన దం పతులు వరద నీటిలో కొట్టుకుపోయి, గల్లంతయ్యారు.ఈసంపల్లి ప్రణయ్(28), కల్ప న(24)లు ఇంటి నుంచి సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు బయ లుదేరారు. మాత్కులపల్లి వరకు వచ్చిన వారు, వాగులో చిక్కుకున్న ట్లు కుటుంబ సభ్యులు అనుమానించారు.