15-07-2025 12:37:28 AM
కొత్తగూడెం, జూలై 14,( విజయక్రాంతి): ఒడిశాలోని బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో జరిగిన దారుణ సంఘటనపై ‘బేటీ బచావో‘లో విఫలమైన బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగాఎన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి జి ఆదేశాల మేరకు సోమవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమ రవీరుల స్తూపం వద్ద,అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ ఏ బీవీపీ విద్యార్థిని సౌమ్య శ్రీ, హెచ్ ఓ డి, సమీర్ సాహు నుండి లైంగిక వేధింపులు , మానసిక హింసను ఎదుర్కొని,తనను తాను నిప్పంటించుకున్నట్లు ఆరోపణలు ఉన్నా యి, ఆమె 90% కాలిన గాయాలతో ఎయి మ్స్ భువనేశ్వర్లో చికిత్స పొందుతోంది. సౌ మ్య శ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కేవలం ఒక విద్యార్థి గురించి కా దు, ఇది భద్రత, గౌరవం , అనే వ్యవస్థకు అర్హులైన ప్రతి మహిళ కోసం పోరాటం అ న్నారు. కళ్లకు గంతలు కట్టుకొని, ప్లే కార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నాయకులు న యీమ్, ఉస్మాన్ అలీ,కాటి సంతోష్, షేక్ షాను, నిఖిల్, సమీర్, షాహిద్, జమీర్, ఇం కెవరు, పవన్, తదితరులు పాల్గొన్నారు.