14-05-2025 01:04:11 AM
నాగార్జునసాగర్, మే 13 : జీరో గోల్ దందా. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనకు ఇది ప్రధాన వ్యాపారం. ఈ చీకటి దందా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పురపాలక సంఘానికి ప్రధాన కేంద్రం. హాలియా ఈ పట్టణంలో ‘జీరో’ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిల్లులు లేకుండా లక్షల్లో లావాదేవీలు తెల్లకాగితాల పైనే నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
జీఎస్టీ లాంటి పన్ను విధానాలు అమలు చేస్తున్నా..కొందరు బంగారం వ్యాపారులు అడ్డదారుల్లో బిల్లులు ఇవ్వకుండా జీరో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ‘ఏ వస్తువు కొనుగోలు చేసినా..బిల్లు తీసుకోవటం తప్పనిసరి. బిల్లు అడగటం వినియోగ దారుడి హక్కు. కానీ చిల్లర వ్యాపారులు అంటే బంగారం తయారీ పేరుతో దుకాణాలు నిర్వహిస్తున్న వారు బిల్లులు లేని బంగారం కొనుగోలు చేసి ఆభరణాలు తయారుచేసి విక్రయిన్నారు.
కొంత బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి బిస్కెట్లు బ్లాక్మనీ ఉన్నవారు కొనుగోలు చేసి అధిక ధరలు వచ్చినప్పుడు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన వాణి జ్యపన్నుల శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తు న్నారు.
భారీగా జీరో వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే ఇతర రాష్ట్రాల నుండి ఎలాంటి టాక్స్లు చెల్లించకుండా బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకువచ్చి మార్కెట్ ధరలకంటే తక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలలో ఎక్కడ స్ట్రగ్లింగ్ బంగారంను దొరికిన ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముకుంటారు.
మార్కెట్ ధరల కంటే తక్కువగా కొనుగోలు చేసిన బంగారంను వ్యాపారస్థులు బిస్కెట్ ఎక్కువగా ఆదాయం వస్తున్నందున సులభంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారిలో వెళ్తున్నారు. బంగారం వ్యాపారంకు హాలియా ప్రసిద్ధి వాణిజ్యపరంగా, రవాణా సౌకర్యాలు కలిగి ఉండటంతో పాటు, ఆంధ్రా సరిహద్దు కావడం వల్ల ఈ బంగారం వ్యాపారం జోరుగా ఉంటుంది.
ఇక్కడ బంగారం తీసుకున్న డోర్ డెలివరీ సదుపాయం ఉంటుంది పెళ్లి ,శుభకార్యాల సందర్భంగా . ప్రతిరోజు 20 నుంచి 30 తులాల ఆర్డర్ ఉంటుంది. ఎటువంటి జిఎస్టి బిల్లులు లేకుండా షాప్ మెయింటినెన్స్ జరుగుతున్నాయి. చూసేదానికి చిన్న షాపుల్లాగానే కనిపిస్తుంది. కానీ కోట్లల్లో వ్యాపారం కొనసాగుతుంది. వీరికి రోజు వారి ఆదాయం 50 వేల నుంచి లక్ష రూపాయలు వీరి లాభం కొనసాగుతుంది.
అధికారులు ఇకనైనా స్పందించి ఇలాంటి వ్యాపారస్తుల మీద నిఘబెట్టుకోవాలని ప్రజలు వాపోతున్నారు. స్మగ్లింగ్ బంగారం కోసం ప్రత్యేకంగా గుమస్తాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంకా కుండా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో సైతం ఎక్కడ స్ట్రగ్లింగ్ బంగారం దొరికిన అది హాలియా చుట్టూ తిరుగుతుంది.
అందులో ప్రధానంగా షాపులకు చెందిన వారు మాత్రమే ఈ తరహ స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. మరొకరు ఏకంగా బిల్డింగ్ మీద బిల్లింగ్లు కట్టుకుంటున్నారు. వ్యాపారులు ఈ వ్యవహారం మూడు పూలు ఆరుకాయల్లాగా వ్యాపారాలు కొనసాగుతున్నాయి.
బ్లాక్ మార్కెట్లో బంగారం కొనుగోలు
బంగారం వ్యాపారం బిస్కెట్ల రూపంలో హోల్సేల్ గా జరుగుతుంది. అందుకు సంబంధించిన నగదు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్యారా జరుగుతాయి. అయితే వ్యాపారులు బిల్లులు లేకుండా తక్కువ ధరకు బంగారాన్ని నేరుగా నగదు చెల్లించి కొనుగోలు చేస్తారు. ఈ బంగారమంతా బ్లాక్లో వ్యాపారం జరుగుతుంది.
దీంతో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతోపాటు, నల్ల డబ్బు చలామణి అవుతుంది. ఇదే తరహాలో కొనుగోలుదారులకు కూడా బిల్లులు ఇవ్వకుండా వ్యాపారం చేస్తున్నారు. ఈ విధానం వలన ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. మరోవైపు కొనుగోలు దారులూ నష్టపోయే పరిస్థితి ఉంది.వ్యాపార నిపుణులు చెబుతున్నారు
తెల్లకాగితంపై వ్యాపారుల బిల్లులు..
నాగార్జునసాగర్ నియోజకవర్గ హాలియా పట్టణ కేంద్రంలోని బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తున్న జీఎస్టీ చట్టం అమలులో ఉన్నా బంగారం జీరో బిజినెస్ మాత్రం ఆగడం లేదు. అమ్మకాల విలువలో కొంత శాతం మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో కనిపిస్తుంది. ఎంత పెద్ద మొత్తంలో బిల్లు అయినా తెల్ల కాగితంపై రాసిస్తారు.
దీనిపై తీసుకున్న వస్తువుల పేర్లు, దుకాణం పేరు, రిజిస్టర్ నెంబర్ కనిపించవు. వినియోగదారులకు బిల్లు ఇస్తే ట్యాక్స్తో వస్తువుల ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతారు. దీంతో వినియోగదారులు సైతం ఎక్కువ మొత్తం చెల్లించలేక బిల్లులు ఇవ్వకున్నా నిమ్మకుండిపోతున్నారు. ఈ విషయం వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు కూడా తెలుసు.
అయినా చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు. పన్ను వసూళ్లు పెరిగేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలలో వాణిజ్యపన్నుల శాఖ ఒకటి. పన్నులు చెల్లించకుండా అక్రమ సరుకుల రవాణాను నిరోధించాల్సిన ఆ శాఖ అందుకు భిన్నంగా వ్యవహారిస్తుందనే ఆరోపణలున్నాయి.
అక్రమ బంగారం మరియు సరుకుల రవాణా జోరుగా సాగుతున్నా తనిఖీలు మాత్రం మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.దీంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.
ఇప్పటికైనా పన్ను ఎగవేతదారు లపైన, అక్రమ సరుకు రవాణా చేస్తున్న వారిపై ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం నిర్థిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.