30-10-2025 06:31:35 PM
ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలను కోత విధించిన ఏపీఓ నవీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్ కు ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఈద లింగయ్య మాట్లాడుతూ మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్ల అక్టోబర్ నెల వేతనం నుండి 250/- ప్రతి ఒక్కరి నుండి మినహాయించారని, కారణాలు చెప్పకుండా వేతనాలలో కోత విధించడం సరైంది కాదన్నారు.
ఇది ఇలా ఉండగా సారoగపెల్లి ఫీల్డ్ అసిస్టెంట్ కు 1397/- శంకర్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ కు 1011/రూ అధిక మొత్తంలో వేతనాలలో కోత విధించడం సరైనది కాదన్నారు. సరైన కారణాలు చూపకుండా, సమాచారం లేకుండా వేతనాలలో కోత విధించిన ఏపీఓపై కఠిన చర్యలు చర్యలు తీసుకొని తమ వేతనం తమకు ఇప్పించాలని వారు అధికారులను కోరారు. వినతి పత్రం అందజేసిన వారీలో ఫీల్డ్ అసిస్టెంట్లు శెట్టి సత్యనారాయణ, లింగాల రాజేందర్, సెగ్గం శంకరయ్య, ఎన్ బాపు, భోగి జ్యోతిలు పాల్గొన్నారు.