calender_icon.png 27 October, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుగుణాకర్ రావుని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం

22-09-2024 05:36:34 PM

కరింనగర్,(విజయక్రాంతి): బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం  గంటలకు 100 మందిపైగా సుగుణాకర్ రావు స్వగృహానికి విచ్చేశారు. రానున్న ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పి సుగుణాకర్ రావు ను గెలిపించుకోవాలన్నారు.  కరీంనగర్ జిల్లాలో బీజేపీ కోసం గ్రామ గ్రామాన తిరిగి అనేకమంది కార్యకర్తలను, నాయకులను తయారు చేసి పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి అని, అలాగే కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ సేవలు చేస్తున్న వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలియజేశారు. రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా రైతుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన నాయకులు పి సుగుణాకర్ రావు ను కొనియాడారు.

వివిధ సమస్యలపై అవగాహన కలిగి ఉండి ప్రజా సమస్యలపై గర్జించే గొంతుకై సుగుణాకర్ రావును గెలిపించవలసిందిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీల అవినీతి అక్రమాలపై మరియు నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, వృత్తి నిపుణులు అన్ని వర్గాల ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించగలిగే సమర్థుడని తెలిపారు. రానున్న ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పి.సుగుణాకర్ రావు గెలుపు కొరకు ప్రతి ఒక్కరం ప్రయత్నం చేస్తామని అలాగే ఓటర్ల అభిమానాన్ని చురగొని గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు దుర్గ మారుతి, శ్రీనివాస్ గౌడ్, బుర్ర సత్యనారాయణ, బాసం కుమార్, కామారపు నరహరి మరియు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.