20-11-2025 04:32:47 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ ఎగోలపు సదయ్య గౌడ్ కు ఎన్టీఆర్ లైఫ్ టైం అవార్డును అఖిలభారత తెలుగు సాంస్కృతిక సమైక్య అధ్యక్షుడు విజయ కుమార్ అందజేశారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సదయ్య గౌడ్ మాట్లాడుతూ తాను 21 ఏళ్లుగా చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారన్నారు. ఈ అవార్డును అందజేసిన వారికి సదయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.