calender_icon.png 20 November, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం

20-11-2025 04:34:23 PM

కోదాడ; మండల పరిధిలోని నల్లబండ గూడెం గ్రామం సాయి మందిరంలో దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాతలు నలపాటి నరసింహారావు శేషారత్నం, బట్టు రమణ శారద దంపతులు అన్నదాతలుగా వ్యవహరిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దేవాలయ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగాని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారావు, శరభయ్య, ఆదినారాయణ, పూర్ణ, శ్యాం, నలపాటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.