calender_icon.png 2 May, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ పదాధికారుల సమావేశం

30-04-2025 12:00:00 AM

తుర్కయంజాల్, (ఏప్రిల్ 30) : తుర్కయంజాల్లో బీజేపీ పదాధికారుల సమావేశం మున్సిపల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ సంఘటన సంరచన విజన్ పదాధికారుల ప్రతిపాదిత జాబితాపై చర్చించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు, ఇతరత్రా కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు బోసుపల్లి ప్రతాప్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బచ్చిగళ్ళ రమేష్, రంగారెడ్డి జిల్లా కోశాధికారి కొత్త రాంరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కోండ్రు పురుషోత్తం, సీనియర్ నాయకులు కందాల బలదేవ్ రెడ్డి, తూళ్ల నరసింహ గౌడ్, సానెం అర్జున్ గౌడ్, బండారి రణధీర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు నోముల కార్తీక్ గౌడ్, నక్క రవీందర్ గౌడ్, కొమ్మిరిశెట్టి భిక్షపతి, కొలన్ రవీందర్ రెడ్డి, మల్లెల రమేష్, విశాల్ గౌడ్, కంచనాని దాసు, నందగిరి సురేష్, నరేందర్ గౌడ్, కొమ్మం శివ తదితరులు పాల్గొన్నారు.