calender_icon.png 1 May, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాక

30-04-2025 12:00:00 AM

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 29 (విజయ క్రాంతి) :  రాష్ట్ర రెవెన్యూ,సమాచార,పౌర సంబంధాల శాఖ,గృహ నిర్మాణ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం పర్యటించ నున్నారు.

సి.సి.కుంట మండలం  అమ్మా పూర్ గ్రామ శివారు కురుమూర్తి దేవస్థానం వద్ద భూ భారతి అవగాహన సదస్సు కు హాజరు కానున్న సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ప్రత్యేకంగా పరిశీలించారు.

అవగాహన సదస్సుకు  స్టేజి,సీటింగ్ ,సౌండ్ సిస్టం,పారిశుధ్యం ఏర్పాట్లపై  కలెక్టర్ అధికారులతో చర్చించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అర్.డి. ఓ నవీన్,డి.అర్.డి. ఓ నర్సింహులు, డిపిఓ పార్థ సారథి,అర్&బి ఈ ఈ దేశ్యా నాయక్, డిపిఅర్ ఓ శ్రీనివాస్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఇస్రా నాయక్ తదితరులు ఉన్నారు.