06-01-2026 09:54:01 AM
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలపై మంగళవారం నాడు బీజేపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(BJP PowerPoint Presentation) ఇవ్వనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో నదీ జాలల కేటాయింపులు, వినియోగంపై పీపీటీ ఇవ్వనుంది. నదీ జలాల గురించిన వాస్తవాలు, గణాంకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వెల్లడించనుంది. నదీ జలాల అంశంలో కేంద్ర ప్రభుత్వం మద్దతుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. బీజేపీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కానుంది. కేంద్ర జల్ శక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ పీపీటీ ఇవ్వనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పీపీటీలో పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుఫున నదీ జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇచ్చారు. నదీ జలాలు - కాంగ్రెస్ ద్రోహాలు అనే అంశంపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.