calender_icon.png 9 January, 2026 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఓటరు జాబితాపై అభ్యంతరాలను పరిష్కరించాలి

07-01-2026 09:09:43 PM

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఓటర్ జాబితా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

జిల్లాల వారీగా ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాల వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ... ఈ నెల 12వ తేదీ నాడు వార్డుల వారిగా ఫోటో ఎలక్టరోల్స్ జాబితా ప్రచురించడంతోపాటు, 13వ తేదీన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రచురిస్తామని తెలిపారు. 16వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురించి, పోలింగ్ కేంద్రాల వారిగా ఫోటో ఎలక్టరోల్స్ ప్రచురిస్తామని వెల్లడించారు.

అభ్యంతరాలు, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణాలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా జనవరి 1వ తేదీన విడుదల చేశామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీపీఓ శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, టీపీఓ లు అన్సార్, సాయి కృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.