07-01-2026 09:36:18 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఉత్సవాల నిర్వహణలో జిల్లా ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలను కోరారు. ఈ నెల 19 తేదీ నుంచి 23 వ తేదీ వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రజలు, తాము కేటాయించిన క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించి, తమ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలిపారు. ప్రజల సూచనల ద్వారా నిర్మల్ ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోగలుగుతామని కలెక్టర్ తెలిపారు.