06-01-2026 09:42:46 AM
హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్ పై అసెంబ్లీలో చర్చ
రెండు అంశాలపై చర్చ పెట్టనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ఐదో రోజు ప్రారంభం కానున్నాయి. నేడు అసెంబ్లీలో హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్-2047పై( Telangana Rising-2047) స్వల్పకాలిక చర్చ జరగనుంది. జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టనుంది. నిన్న అసెంబ్లీలో జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Government) తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ ఇప్పటికే రాష్ట్రంలో దుమారం రేపింది. భూ దోపిడి కోసమే హిల్ట్ పాలసీ అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.