calender_icon.png 30 October, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ గెలుపునకు కృషి చేయాలి

30-10-2025 01:56:33 AM

-ప్రతి ఓటరుకు చేరువ కావాలి

-మోదీ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలి

-పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునిల్ బన్సల్

-పదాధికారుల సమావేశంలో జూబ్లీహిల్స్ ఎన్నికపై నేతలకు దిశానిర్దేశం  

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికే ప్రధాన ఎజెండాగా బీజేపీ బుధవారం రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ హాజరయ్యారు. కొత్త రాష్ర్ట కమిటీ ఏర్పాటు తర్వాత పదాధికారులతో సునీల్ బన్సల్ తొలిసారిగా సమావేశ మయ్యారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జరిగిన ప్రచార తీరు, ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపునకు ప్రతి నేత కృషి చేయాలని సూచించారు.

ప్రతి ఓటరుకు చేరువకావాలని తెలిపారు. అలాగే రాష్ర్టంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. పదాధికారులతో సమావేశం తర్వాత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. రాబోయే కాలంలో పార్టీ బలోపేతం, విస్తరణకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను గడపగడపకు చేరేలా ప్రచారం ముమ్మరం చేయాలని, గత బీఆర్‌ఎస్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అరాచకా లను, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీలు, అమలు కాని గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

కలసికట్టుగా ముందుకు: రాంచందర్ రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ...అందరం కలిసికట్టుగా ముం దుకు వెళ్దామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించాలన్నారు. మంగళవారం చేసిన కార్పెట్ బాంబింగ్ ప్రచారానికి బయపడి ముఖ్యమంత్రే నేరుగా ప్రచారానికి దిగారన్నారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం, బీజేపీకి మధ్యనే పోటీ అని, కాంగ్రెస్‌కు అభ్య ర్థులు లేరు కాబట్టే ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టుకుందని విమర్శించారు.  జూబ్లీ హిల్స్ లో బీజేపీ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని, అందరం కష్టపడి విజ యం సాధించాలన్నారు. సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.