30-10-2025 01:55:23 AM
ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఏర్పాట్లు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాల (ఈవీఎంల) రెండో విడత రాండమైజేషన్‌ను పూర్తి చేశారు. ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకుడు రంజి త్ కుమార్, పోలీస్ పరిశీలకుడు ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకుడు సంజీవ్ కుమా ర్ లాల్‌తో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెం ట్ల సమక్షంలో ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు.
కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ అధికారి పి. సాయి రామ్ తదితర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జీహెఎంసీ హెడ్ ఆఫీస్ లో ఎన్నికల విధులు బాధ్యతలపై జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక విధుల్లో పాల్గొనే 120 మందికి పైగా మైక్రో అబ్జర్వర్స్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్, శిక్షణ నోడల్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.