calender_icon.png 30 October, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాదారుల కన్నుపడితే అంతే!

30-10-2025 12:55:01 AM

-పార్కుస్థలం.. రాత్రికి రాత్రే మాయం

-పెద్దఅంబర్‌పేట్‌లో కబ్జాదారుల బరితెగింపు 

-ఎమ్మెల్యే ఆదేశాలను లెక్కచేయని అధికారులు

-ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు

-నోటీసుల పేరుతో మున్సిపల్‌ఆఫీసర్ల కాలయాపన 

-పార్కు స్థలంలో యథేచ్ఛగా వెలిసిన వెలసిన రూములు

పెద్దఅంబర్‌పేట్‌లో కబ్జాదారులు బరితెగించారు. ప్రజాప్రయోజనాల కోసం వదిలిన పార్కు స్థలం, ఓపెన్‌స్థలాలను దర్జాగా కబ్జా ప్రీకాస్టు వాల్‌నిర్మించారు. పార్కు స్థలం కబ్జాపై వ్యవహారాంపై స్థానికులు, కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఆయన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నోటీసుల పేరుతో కాయాలపన చేస్తున్నారు. అధికారుల అలస్వతాన్ని ఆసరా చేసుకుని కబ్జాదారులు పార్కు స్థలంలో రాత్రికి రాత్రే రూమ్‌లు నిర్మించారు. 

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 29: కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలం, ఓపెన్, స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని... అందులో ప్రీకాస్టు వాల్ నిర్మించారు. ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 1100 గజాల పార్కు స్థలం, ఓపెన్ స్థలాలు విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుంది. ఆ స్థలంలో నిర్మించిన నిర్మాణాలను కూల్చడానికి.. మున్సిపల్ అధికారులు నాన్చుతున్నారు. కబ్జా వ్యవహారంపై స్థానిక నేతలు, జన చైతన్య హౌసింగ్ కార్పొరేషన్ కాలనీ వాసులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఫిర్యాదులు చేశారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మున్సిపల్, సబ్‌రిజిస్టార్ అధికారులు ఫోన్‌లో పార్కు స్థలం కబ్జా వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించి వారం రోజులు గడుస్తున్నా.. ఆయన ఆదేశాలను అధికారులు  బేఖాతర్ చేస్తూ రేపుమాపు అంటూ దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. నోటీసులపేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ పార్కు స్థలం కబ్జా వ్యవహారం అధికారుల నోటీసులో ఉన్నప్పటికీ అక్కడ రాత్రికి రాత్రే రూమ్‌లు నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమీ చేస్తున్నారు? అధికారులు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్

పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి సర్వేనెంబర్153, 168  జన చైతన్య హౌసింగ్ కార్పొరేషన్ లే అవుట్ లోని ఓపెన్ స్థలం, పార్కు స్థలం, కబ్జాపై విజయక్రాంతి  దినపత్రికలో రూ. 5 కోట్ల పార్కు స్థలం కబ్జా అనే కథనం గత బుధవారం ప్రచురితమైనది. ఈ కథనం ఆధారంగా స్థానిక నాయకులు, కాలనీవాసులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్ రెడ్డి, సబ్ రిజిస్టర్ రవీందర్‌లకు కబ్జా వ్యవహారంపై ఫోన్‌లో మందలించినట్లు కాలనీ వాసులు తెలిపారు. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు  ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే ఆదేశాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది.   

మున్సిపల్ అధికారులు గప్‌చుప్

పార్కు స్థలం, ఓపెన్ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేసుకుని ఆ స్థలంలో అక్రమంగా ప్రీకాస్టు వాలు నిర్మించారు. ఆ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాడానికి వెనకడుగు వేస్తున్నారు. నోటీసుల పేరుతో రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రజాప్రయోజనాల కోసం వదిలిన పార్కు స్థలం కబ్జాపై అన్నీ ఆధారాలతో మున్సిపల్ అధికారులు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని స్థానికులు అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఆ స్థలంలో రాత్రికి.. రాత్రే రూమ్‌లు కూడా నిర్మించారు. అధికారుల నోటీసులో ఉన్నప్పటికీ రూమ్‌లు నిర్మిస్తుంటే అధికారులు ఏమీ చేస్తున్నారని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. 

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తాం

పెద్దఅంబర్‌పేట్‌జనచైతన్య హౌసింగ్ కార్పొరేషన్‌లే అవుట్‌లో పార్కు స్థలం, ఓపెన్‌స్థలం కబ్జా వ్యవహారంపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకెళ్లాం. ఈ కబ్జాపై సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకో వాలని ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేస్తాం.

  నర్సిరెడ్డి, పెద్దఅంబర్‌పేట్‌వాసి