05-07-2025 12:02:02 AM
బిజెపి నాయకులు ధార రవి సాగర్
మందమర్రి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కునేది నిరుపేద విద్యార్థులే అని వారికి అన్నివేళలా అండ గా ఉంటూ వారి విద్యాభివృద్ధి కి తగిన ప్రోత్సాహం అందిస్తానని మండల బిజెపి నాయకులు ధార రవి సాగర్ స్పష్టంచేశారు. మండలం లోని పొన్నారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవా రం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, బ్యాగ్స్ నోటు పుస్త కాలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందుతుందని ప్రైవేట్ పాఠ శాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరుస్తు న్నారన్నారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించా లనే లక్ష్యంతో విద్యాసామాగ్రి పంపిణీ చేపట్టామని, భవిష్య త్తులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాను అండగా నిలుస్తానని ఆయన భరోసా ఇచ్చారు. బిజెపి మండల యూత్ ప్రెసిడెంట్ పెంచాల రంజిత్ అధ్యక్షతన నిర్వహించి న కార్యక్రమంలో బిజెపి మండల జనరల్ సెక్రెటరీ మంజరి వెంకటేష్, క్యాతన పల్లి యూత్ ప్రెసిడెంట్ సంతు రామ్, యువ మోర్చా నాయకులు కాపురపు వినయ్, ఎగిరపు సామ్యూల్, జమ్మిడి దిలీప్, గ్రామస్తులు మాసు బానేష్, మల్లయ్య లు పాల్గొన్నారు