23-08-2025 01:25:46 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి): బీజేపీ చేపట్టిన ‘సేవ్ హైదరా బాద్’ సచివాలయ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతల మధ్య భగ్నమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించేందు కు వస్తున్న కమలదళాన్ని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేసి, గృహ ని ర్బంధాలు చేశారు. దీంతో శుక్రవా రం నగరంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. శాంతియుత నిరసనను అణచివేయడంపై కేం ద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అడుగడుగునా అడ్డగింతలు.. అరెస్టులు
నగరంలో ప్రాణాలను బలిగొంటున్న వేలాడే కరెంట్ తీగలు, అరగంట వానకే పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా మారిన నాలాలు, గుంతల రోడ్లు, వీధికుక్కల దాడి వంటి సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యమైపోయిందని ఆరోపిస్తూ సచివాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, కార్పొరేటర్ల ఇళ్ల వద్ద భారీగా మోహరించి వారిని గృహ నిర్బంధం చేశారు. తు ర్కయాంజల్‌లో పలువురు నేతలను అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టే షన్‌కు తరలించారు.
అయితే పోలీసుల కళ్లుగప్పి, గృహ నిర్బంధాలను ఛేదించుకుని కొందరు నేతలు సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో సరూర్‌నగర్ కార్పొరేటర్ శ్రీవాణిని, ఆమెతో పాటు ఉన్న మరికొందరు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజా సమస్యలే అజెండాగా
నగరం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెవి మీద పేను పారినట్టుగా కూడా లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే తాము ఈ ఆందోళన చేపట్టామని, కానీ ప్రభుత్వం అరెస్టులతో తమ గొంతు నొక్కాలని చూస్తోందని విమర్శించారు.
రాష్ర్ట అధ్యక్షుడి అరెస్ట్
చేవెళ్లలో ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో పాల్గొని నగరానికి తిరిగి వస్తున్న రాష్ర్ట అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. మొయినా బాద్ మండల పరిధిలో ఆయన కాన్వాయ్‌ను అడ్డగించి, అరెస్టు చేసి స్థానిక పోలీ స్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ర్ట అధ్యక్షుడి అరెస్టుతో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
కాంగ్రెస్ సర్కార్‌కు అంత భయమెందుకు: బండి
అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ అరెస్టులపై తీవ్రస్థాయిలో స్పందించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తోందన్నారు. జీహెచ్‌ఎంసీలో తమ వైఫ ల్యాలను కప్పిపుచ్చుటకునేందుకే బీజేపీ కార్యకర్తలపై అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని విమర్శిం చా రు.
అసలు బీజేపీ అంటే కాంగ్రెస్ సర్కార్‌కు అంత భయమెందుకు? ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేస్తు న్న వారిని అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రామచంద్రరా వుతో పాటు, కార్యకర్తలు, కార్పొరేటర్లందరినీ తక్షణమే బేషరతుగా విడు దల చేయాలని, లేనిపక్షంలో రేవంత్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.
మొత్తంమీద, ఈ ఘటనతోఅధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఘర్షణ మరింత ముదిరినట్లయింది. అరెస్టులు, కేసులకు భయ పడబోమని, హైదరా బాద్ ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ స్పష్టం చేసింది.