30-09-2025 01:05:22 AM
కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలను కైవసం చేసుకుని కొత్త చరిత్రను లిఖిస్తాం
ఐపీఎల్, ఆసియా కప్ భారత్ దే....
రేపు జరగబోయే కేపీఎల్, ఎస్పీఎల్ కప్ కాషాయానిదే
స్థానిక నగారా నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, సెప్టెంబర్29(విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. “నాకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న నా కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు... గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు నేను సిద్ధ అన్నారు.
స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతోందని కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం” అని స్పష్టం చేశారు. ఆసియా కప్, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లలో ఇండియా ఘన విజయం సాధించినట్లుగానే రేపు జ రగబోయే కరీంనగర్ పల్లె లీగ్ (కేపీఎల్ లీగ్), సిరిసిల్ల పల్లె లీగ్ (ఎస్పీఎల్) స్థానిక పోటీల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్నారు.
పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న నిఖ్సాన బీజేపీ కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. టిక్కెట్లు ఇవ్వడంతోపాటు గెలిపించుకుని కాషాయ కార్యకర్తల నుదుటిన విజయ తిలకం దిద్దుతామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామనినాటి బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలవల్ల స్థానిక సం స్థలు పూర్తిగా నిర్వీర్యమైనయ్.
గత బీఆర్‌ఎస్ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకపోవడమే కాక అభివ్రుద్ది పేరుతో నాటి సర్పంచులు చేసిన పనులకు కూడా బిల్లులివ్వకుండా వేధించిందన్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను సైతం దారి మళ్లించిందని. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవంటూ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా ఈ పార్టీ చేతులెత్తేసిందన్నారు.