calender_icon.png 27 September, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాప్రతినిధుల అసమర్ధత వల్లే రహదారుల విధ్వంసం

27-09-2025 12:58:10 AM

- ఇసుకాసురుల అత్యాశకు 120 కిలోమీటర్ల జాతీయ రహదారి ధ్వంసం

- గడిచిన రెండేళ్లలో అనేక ప్రమాదాలకు

- భద్రాచలం నుండి వెంకటాపురం వరకు జాతీయ రహదారిని పునర్మించాలి

- ఈనెల 29న సిపిఐఎం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర

- లక్ష్మీ నగరం నుండి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మహాపాదయాత్ర

- పాత్రికేయుల సమావేశంలో సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

భద్రాచలం, సెప్టెంబర్ 26, (విజయక్రాంతి):ఇసుకాసురుల అత్యాశకు స్థానిక ప్ర జాప్రతినిధుల అసమర్ధత తోడవడం వల్లనే భద్రాచలం నుండి వాజేడు వరకు జాతీయ రహదారి విధ్వంసానికి గురైందని, ధ్వంసమైన రోడ్లను వెంటనే పునర్మించాలని సిపి ఐఎం ఆధ్వర్యంలో ఈనెల 29న లక్ష్మీనగరం నుండి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మహా పాదయాత్రను నిర్వహిస్తున్నామని జిల్లా సిపిఎం కార్యదర్శి మచ్చ వెంక టేశ్వర్లు తెలియజేశారు. శుక్రవారం స్థానిక చందర్రావు భవనంలో జరిగిన పాత్రికేయు ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల అసమర్ధత వల్లే భద్రాచలం నుండి వాజేడు వరకు జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసం అయిందన్నారు.

ప్రధానంగా ఇసుక లారీల కారణంగానే ఇంత పెద్దఎత్తున రహదారి విద్వాసం జరిగిన ప్రజాప్రతినిధులు చీమకుట్టినట్లుగా లేదున్నారు. గడిచిన రెండేళ్లలో ఇసుక లారీలతో అనేక రోడ్డు ప్రమా దాలు జరిగాయని అంతేకాకుండా రోడ్డుపై ఏర్పడ్డ గుంతలతో ద్విచక్ర వాహనాలు ఆటోలు భారీ వాహనాలు అనేక ప్రమాదాలకు గురైనాయని, ఇన్ని ప్రమాదాలు జరి గినా ప్రభుత్వ పెద్దలు స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని మచ్చ ఆరోపించారు. ఇంకెంత మంది ప్రాణాలను బలి కొంటే ప్రభుత్వ పెద్దలు స్పందిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యే సొంత గ్రామాలలో సైతం రహదారులు అధ్వానం నియోజవర్గ రహదారుల అభివృద్ధి కోస మే ముఖ్యమంత్రిని కలిసాను తప్ప పార్టీ మారలేదని బహిరంగ ప్రకటన చేసిన ఎమ్మె ల్యే తెల్ల వెంకటరావు సొంత మండలం దుమ్ముగూడెం సొంత గ్రామాలలో సైతం అంతర్గత రహదారులు అత్యంత దారుణం గా తయారయ్యాయని దుమ్ముగూడెం మం డలం తూరుబాక వద్ద జాతీయ రహదారి కనుమరుగై పోయిందని, అయినా ఎమ్మెల్యే స్పందించకపోవడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు.ఇసుక టెండర్ ప్రక్రియలోనే రహదారుల పరిరక్షణ బాధ్యత కూడా సం బంధిత ఇసుక సొసైటీలపైనే ఉంటుందని స్పష్టంగా ఉన్నప్పటికీ రీజనింగ్ కాంట్రాక్టర్లు దాని విస్మరిస్తున్నారు కనీసం చిరు మరమ్మతులు కూడా పట్టించుకోకుండా రోడ్లు ఈ స్థాయి లో విధ్వసం అవుతున్న చోద్యం చూ స్తున్నారు.

ఎవరికి ఇయ్యాల్సిన ముడుపులు వాళ్లకి ఇస్తున్నాము కనుక మమ్మల్ని ఎవరేం చేయలేరు అన్న విధంగా ఇసుక కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.జాతీయ ర హదారి తో పాటు గ్రామాలలో అంతర్గత రోడ్లను మరమ్మతులు చేపట్టాలని గత ఆరు నెలలుగా సిపిఎం ఆధ్వర్యంలో అనేక రకాలుగా పోరాటాలు నిర్వహిస్తున్నాం. గత నెల లో దుమ్ముగూడెం తూర్పాక వద్ద జాతీయ రహదారిపై సుమారు నాలుగు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు దుమ్ముగూడెం - చర్ల మండలాలలో అనేక గ్రామాల లో ఆయా కమిటీల ఆధ్వర్యంలో తమ నిరసనను తెలియజేశారు. ఎమ్మెల్యేలకు, ఎం పీలకు, మంత్రులకు సైతం దండాలు పెట్టి దరఖాస్తులు ఇచ్చాము, అధికారులు కలిసి విన్నపాలు అందించాం అయినా ఇటు ప్రజాప్రతినిధులు గాని ప్రభుత్వ అధికారులు గానీ ఏమాత్రం స్పందించడం లేద న్నారు.

జాతీయ రహదారి పరిరక్షణ కోసం మహాపాదయాత్ర.ధ్వమసమైన జాతీయ రహదారిని పునర్మించాలని ఇసుక కాంట్రాక్టర్ల నుండి రహదారులను రక్షించాలని కోరుతూ సిపిఐ ఎం ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం నుండి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 1000 మందితో మహా పాదయాత్రను నిర్వహిస్తు న్నాం. ఉదయం 9 గంటలకు లక్ష్మీనగరం వద్ద ప్రారంభమయ్యే మహాపాదయాత్ర మ ధ్యాహ్నం మూడు గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటుంది అక్కడ సబ్ కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చే అంతవరకు మా నిరసనను కొనసాగిస్తాం అన్నారు.

మహా పాదయాత్ర విజయవంతనికి ఇప్పటి కే దుమ్ముగూడెం మండలంలో ప్రతి గ్రా మాన విస్తృత జనరల్ బాడీ సమావేశాలు న పట్టణంలో కూడా ఆయా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని రైతుల నుండి సామాన్య ప్రజల నుండి అపూర్వ స్పందన ఈ మహా పాదయాత్రకు వస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా రహదారుల విద్వాసాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నప్పటికీ వారు స్పందించని నేపథ్యంలో సిపిఎం చేస్తున్న ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని చెప్పాలి.

ఈ మహా పాదయాత్రలో జిల్లా పార్టీ కార్యదర్శి నేను నాతోపాటు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య ఎం బి నర్సారెడ్డి తోపాటు జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గ ముఖ్య నాయకత్వం మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారని తెలిపారు.సిపి ఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వా మి అధ్యక్షతన జరిగిన ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, ఎం.బి నర్సారెడ్డి, కే బ్రహ్మచారి జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, బండారు శరత్ బాబు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి పారేల్లి సంతోష్ కు మార్ తదితరులు పాల్గొన్నారు.