13-12-2025 12:00:00 AM
కోదాడ, డిసెంబర్ 12 : సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. ముస్లింలకు పవిత్రమైన రోజు అయిన శుక్రవారం నాడు చలిలో వణుకుతూ మసీదుల వద్ద బిక్షాటన చేస్తున్న వృద్ధులకు, అనాధలకు దుప్పట్లను ను పంపిణీ చేశారు.
సమాజంలో నిరక్షరాస్యులు, నిరుపేదలకు సహాయ, సహకారాలు అందిస్తూ అండగా నిలవాలని సంఘ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాలేమియా, యస్ దాని, హసన్ జానీ, తిరుపతమ్మ, వీరబాబు, రాంబాబు, హుస్సేన్, శ్రీనివాసరావు, భ్రమరాంబ, రఘు తదితరులు పాల్గొన్నారు.