22-12-2025 12:00:00 AM
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు
విజ్ఞాన్స్ విశ్వవిద్యాలయంలో రక్తదాన శిబిరానికి విశేష స్పందన
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటానికి యువత ముందు కు రావాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచం పల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్, ఎస్‌ఏసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించా రు. ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 120 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ.. మానవత్వమే మతం కావాలని, ఆపదలో ఉన్న వారికి ప్రాణదా నం చేయడం కంటే మించిన సేవ ఇంకోటి లేదని అన్నారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వారికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలన్నారు. రక్తదానంపై యువత మూఢనమ్మకా లను వీడి, దానం చేయాలన్నారు. అన్ని దా నాల్లో కెల్లా రక్తదానం ప్రాణదానంతో సమానమని విద్యార్థులకు తెలియజేశారు. కార్య క్రమంలో ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధిపతులు, విద్యార్థులు, ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ల సిబ్బంది పాల్గొన్నారు.