22-12-2025 12:00:00 AM
పార్టీ అధికారంలో ఉన్న పంచాయతీలు రాలేదెందుకు?
సమన్వయంతో పనిచేయలేదని నేతలకు చురుక
వచ్చే ఎన్నికలు ప్రామాణికమని ఘాటు హెచ్చరిక
హైదరాబాద్ సమావేశంలో
జీపీ ఎన్నికలపై సమీక్ష
నిర్మల్ డిసెంబర్ 21 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అధికారులకు వచ్చి రెండేళ్లు పూర్తయిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు సమన్వ యంతో పని చేయకపోవడం పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కార్డు హెచ్చరికలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మ డి ఆదిలాబాద్ ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో బిజెపి మద్దతుదారులు ఎక్కువగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం పై ముఖ్యమంత్రి సీరియస్ గానే జిల్లా నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉండగా నిర్మల్ ముధోల్ అదిలాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం లో బిజెపి ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ పాయల శంకర్ పాల్వా యి హరీష్ బాబు ప్రాతినిథ్యం వేస్తున్నారు.
బూత్ ఆసిఫాబాద్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ యాదవ్ కోవలక్ష్మి ప్రాతినిధ్య వైస్తుండగా ఖానాపూర్ బెల్లంపల్లి చెన్నూరు మం చిర్యాల అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్య వహిస్తున్నారు దీంతో స్థానిక సంస్థల ఎన్నికలైన గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో సెట్టింగ్ ఎమ్మెల్యేల ప్రభావంతో రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారుల్లో ఉన్నప్పటికీ సర్పంచులు ఆశించిన స్థాయిలో సీట్లు గెలుచుకోకపోవడంపై అక్కడి నియోజకవర్గం నేతల సమన్వయ లోపమేనని ఇది పార్టీకి వ్యక్తిగతంగా లీడర్లకు నష్టమని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ముధోల్ నిర్మల్ నియోజవర్గం బిజెపి ఎక్కువ సీట్లు సాధించడం పై ఆయన లోతుగా విచారించి నివేదిక ఇవ్వాలని డిసిసి అధ్యక్షులను ఆదేశించారు
అదిలాబాద్ జిల్లా నేతలపై అసహనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల లో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా నేతలపై అసహనం వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో సుమారు 1500 పైగా గ్రామపంచాయతీ ఉండగా అందులో కాంగ్రెస్ పార్టీ సగం స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న ట్టు నేతలు నివేదిక రూపంలో అందించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించే లీడర్లు ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో వారి అనుచరులను గెలిపించుకో వడంలో వారు విఫలం కావడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర మంత్రి వెంకట్ వివేక్ సామి రాష్ట్ర పౌరసర సంస్థ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి పార్టీ అగ్ర నాయకులు ఏ ఇంద్రకరణ్ రెడ్డి వేణుగోపాల చారి మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి రేఖా శ్యాం నాయక్ తదితర నేతలు ఉన్నప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నియో జకవర్గ ఇన్చార్జిలతో మండల స్థాయి నేతలతో సమన్వయం చేయకపోవడం వలన గ్రామాల్లో సర్పంచ్ ఫలితాలు భిన్నంగా ఉన్నాయని ఆక్షేపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోవడం కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ ప్రజాప్రతినిధులు ఉండడం ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇతర పథకాలను ప్రజలకు అందించినప్పటికీ వాటిని విస్తృతంగా ప్రజల్లో చర్చించకపోవడం వలన పార్టీకి నష్టం జరిగినట్టు చెప్పి నట్టు ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీని బలోపితమే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్ని నియోజ కవర్గాల్లో పార్టీ జిల్లా ఇన్చార్జిలు మార్చడం పార్టీలో పాత కొత్త నాయకుల మధ్య సమన్వయని పెంపొందించడం గ్రూపు విభేదాల ను సమసి పోయేలా చర్యలు తీసుకోవాలని సూచించిన విషయం తెలిసింది అయితే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచులకు కొందరు నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆ గ్రామంలో అభ్యర్థి ఎంపిక సమన్వ యం లేకపోవడం వల్ల గెలవలసిన చోట ఓడిపోయినట్టు డిసిసి అధ్యక్షులు పార్టీ చీఫ్ మహేష్ కుమార్ కొడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గం నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది దీనిపై ముఖ్యమంత్రి త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో అయినా పార్టీ నేతలందరూ కూడా సమన్వయంతో పనిచేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యతను స్వీకరించాలని సూచించారు.
ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందితే మెజార్టీ ఫలితాలు సాధించకపోతే అక్కడి నేతల వైఫల్యం అని చురకలు అంటించినట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు నడిపి స్తే అది పార్టీకి నష్టమని వ్యక్తిగతంగా అక్కడి ప్రజాప్రతినిధి కూడా నష్టమని పద్ధతి మార్చుకోవాలని సూచించినట్టు తెలుస్తోం ది. పార్టీ కోసం అరునిషాలు కష్టపడి పని చేసే కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు పార్టీలో గౌరవం దక్కాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఏదో ఒక పదవి వస్తేనే ప్రజలు ఉంటుందని ఆ దిశగా ఇప్పటికైనా నేతలందరూ కూడా సమన్వయంతో ముం దుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించినట్టు ప్రచారం జరుగుతుంది
సమన్వయంతో ముందుకు వెళ్తాం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలైన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సగానికి పైగా కాంగ్రెస్ కాంగ్రెస్ మద్దతు గెలిచారని అది పార్టీ కార్యకర్తలకు కృషి అని అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ ముఖ్య మంత్రికి నివేదిక వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల సమన్వయంతో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు వచ్చే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యతను తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు.
ఆ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలపై నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందించి అక్కడ రాజకీయ సమీకరణలు సెట్టింగ్ ఎమ్మెల్యేల ప్రభావం తదితర అంశాలను ముఖ్యమంత్రి వివరించినట్టు తెలుస్తుంది. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేతలందరినీ సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాన్ని విస్తృతం చేయడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అందులో మంచి ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తామని డిసిసి అధ్యక్షులు వెడుమ బుజ్జు పటేల్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.