calender_icon.png 22 December, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోల్ మోడల్‌గా ప్రజా గ్రంథాలయం

22-12-2025 12:00:00 AM

విద్యార్థులు కోరిన పుస్తకాలు 24 గంటల్లో అందిస్తా

కొత్తకొండ వీరభద్రుని దర్శించుకున్న సీఎం ఓఎస్డీ

భీమదేవరపల్లి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని ప్రజా గ్రంథాలయాన్ని తెలంగాణకు రోల్ మోడల్‌గా నిలుపుతామని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేముల శ్రీనివాస్-, అరుణ దంపతులు బీవీఆర్ బాచుపల్లి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ విష్ణు రాజు బాచుపల్లి కొత్తకొండ వీరభద్రుని దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓఎస్డీ శ్రీనివాస్, ఇంజినీరింగ్ కళాశాల చైర్మ న్ విష్ణు రాజును ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఓఎస్డీ మీడి యాతో మాట్లాడుతూ.. ముల్కనూర్ ప్రజా గ్రంథాలయానికి విద్యార్థులు అడిగిన పుస్తకాలను 24 గంటల్లో అందిస్తామని చెప్పా రు.

గ్రంథాలయంలో ప్రతి సంవత్సరం ఉత్తమ కథల పోటీని పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని కథా రచయితలకు ప్రత్యేకంగా బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు. తెలుగు కథల  సాహిత్యం వల్ల తెలుగు భాషా పట్ల మక్కువ ఏర్పడుతుందన్నారు. విద్యార్థులు తెలుగు సాహి త్యం పట్ల మక్కువ చూపించాలని దీనివల్ల పోటీ పరీక్షలలో రానిస్తారని సూచించా రు. ప్రజా బృందంలో చదువుకున్న 30 మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్నారని గుర్తుచేశారు.

ఉన్నతస్థాయి కథలు రాస్తున్న మంచి కథ రచయి తల 10 మంచి పుస్తకాలు చదివితే జీ వితా లు మెరుగవుతాయన్నారు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అన్నా రు. నేటి యువత వారికి ఏం చేయాలో తెలియక చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారని, వారు ఉన్నతస్థాయి పుస్తకాలు చదివితే ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పారు. యువత కథలు, సాహిత్యం వైపు దృష్టి సారించాలని తెలిపారు. ఆయన వెంట సుద్దాల సంపత్, కిషన్ ప్రసాద్, ముళ్ల శ్రీనివాస్, పళ్ల ప్రమోద్‌రెడ్డి, తాళ్ల వీరేశం, హనుమత్పురి ఆలయ చైర్మన్ కాసం రమేష్ గుప్తా, కొత్తకొండ మాజీ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్త, మాడిశెట్టి కుమారస్వామి, ఆలయ అర్చకులు కే రాజయ్య మొగిలిపాలెం, రాంబా బు, గుడ్ల శ్రీకాంత్  ఉన్నారు.