22-08-2025 11:53:56 PM
బోథ్,(విజయక్రాంతి): బోథ్ పట్టణంలోని సాయి నగర్ కు చెందిన కొప్పుల ప్రణీత్ ఇండియన్ నేవీ కి ఎన్నికయ్యాడు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నేవీలోని ఎస్ఆర్ఆర్ విభాగానికి ఎంపికైనట్లు తెలిపారు. కొప్పుల రాములు -కవిత దంపతుల కుమారుడైన ప్రణీత్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. నేవికి ఎంపికైన ప్రణీత్ ను తల్లిదండ్రులు గ్రామస్తులు అభినందించారు.