calender_icon.png 23 August, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

23-08-2025 12:20:19 AM

బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీ లంబాడి కుంట తండా వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో భాగంగా రూ. 4 కోట్ల 50 లక్షల నిధులతో భూత్పూర్ నుంచి నాగర్ కర్నూల్ మెయిన్ రోడ్డు నుండి వయా చౌల తండా, కరివేన గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో భూత్పూర్ మండలంలో అభివృద్ధి పడకేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు గ్రామాల నుంచి బిటి  రోడ్లకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో చేయలేనిది 18 నెలల కాంగ్రెస్ పాలనలో చేసి చూపించామని అన్నారు.