calender_icon.png 23 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

23-08-2025 12:21:13 AM

విద్య,వైద్యం, సంక్షేమ హాస్టల్‌లో కలెక్టర్ దివాకర ఆకస్మిక తనిఖీలు 

ములుగు,మంగపేట ఆగస్టు22(విజయక్రాంతి):ములుగు జిల్లాలో విద్య,వైద్యం,సంక్షేమ హాస్టల్ లో జిల్లా అధికారులచే ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పేర్కొన్నారు.  తనిఖీలు చేపట్టినప్పుడు ఉద్యోగులు అందుబాటులో లేకపోయిన,హాస్టల్ లో మెను అమలు చేయకపోయినా, సిబ్బంది విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు శుక్రవారం మంగపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో క్లాసు రూమ్ లను, డైనింగ్ హాలు ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సబ్జెక్టుల వారీగా వివరాలు అడిగి తెలుసుకొని, తెలుగు, ఇంగ్లీష్ పై పట్టు సాధించాలని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని పోటీ తత్వంలో ముందుకు వెళ్లాలని అన్నారు. మీరు మంచిగా చదువుకోని మీ తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని  విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో కలిసి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా వివరాలు  అడిగి తెలుసుకున్నారు.